ఆసియా పారా క్రీడలు–2026లో పురుషుల లాంగ్ జంప్ టీ44/టీ62/టీ64 విభాగంలో స్వర్ణం సాధించిన సొలైరాజ్ ధర్మరాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. అద్భుతమైన జంప్ చేసి అసాధారణ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు.
తన ఆసియా రికార్డును తానే అధిగమించి మరోసారి తన అద్భుతమైన నైపుణ్యాలను, సంకల్పాన్ని ప్రదర్శించారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా పారా క్రీడలు–2026లో పురుషుల లాంగ్ జంప్ టీ44/టీ62/టీ64 విభాగంలో సొలైరాజ్ ధర్మరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అసాధారణ రీతిలో జంప్ చేసి స్వర్ణం గెలుచుకున్నారు. తన సొంత ఆసియా రికార్డును తానే అధిగమించి మరోసారి తన క్రీడా నైపుణ్యాలను, పట్టుదలను ప్రదర్శించారు. ఈ అద్భుతమైన విజయం సాధించిన సొలైరాజ్కు అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’
***
Solairaj Dharmaraj has delivered an exceptional performance in the Men’s Long Jump T44/T62/T64 event at the Asian Para Games 2026, winning Gold with a phenomenal jump. By surpassing his own Asian Record, he has once again demonstrated his tremendous skills and determination. Congratulations to Solairaj on this outstanding triumph. May he continue to achieve greater heights: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026