Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ రజత పతక విజేత జయంతికి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌-2026.. మహిళల 400 మీటర్ల టీ47 పోటీలో చాలా చక్కని టైమింగుతో రజత పతకాన్ని గెలిచిన జయంతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘గొప్ప రజత పతకమిది!
ఆసియా పారా గేమ్స్‌-2026.. మహిళల 400 మీటర్ల టీ47 పోటీలో జయంతి చాలా చక్కని టైమింగుతో రజత పతకాన్ని సాధించారు. ఆమె శ్రమ, క్రీడాస్ఫూర్తి అభినందనీయాలు. ఆమె ఇక ముందు కూడా రాణించాలని కోరుకుంటున్నాను:  PM @narendramodi’’. 
 
***