ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల 400 మీటర్ల టీ47 పోటీలో చాలా చక్కని టైమింగుతో స్వర్ణ పతకాన్ని సాధించిన శ్రీ దిలీప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
మెరుగైన ప్రదర్శనతో శ్రీ దిలీప్ తన టైటిల్‌ను కాపాడుకోవడం ప్రశంసనీయ విజయమని శ్రీ మోదీ అన్నారు. ఆయన కనబరిచిన వేగం, దృఢ సంకల్పం, అంకితభావం నిజంగా అభినందనీయమనీ, ఆయనను చూసి భారత్ సంతోషిస్తోందనీ ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల 400 మీటర్ల టీ47 పోటీలో చక్కని సమయపాలనతో స్వర్ణ పతకాన్ని గెలిచిన శ్రీ దిలీప్‌ను మనసారా అభినందిస్తున్నాను. మెరుగైన ప్రదర్శనతో శ్రీ దిలీప్ తన టైటిల్‌ను కాపాడుకోవడం ప్రశంసనీయ విజయం. ఆయన కనబరిచిన వేగం, దృఢ సంకల్పం, అంకితభావం నిజంగా అభినందనీయం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***
Heartiest congratulations to Dilip on winning Gold in the Men’s 400m T47 event at the Asian Para Games 2026 with an outstanding timing. Successfully defending his title with an improved performance is a remarkable achievement. His speed, determination and dedication are truly commendable. India is proud of him: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026