Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ కేంద్ర శంకుస్థాపనలో తన ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని

ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్  కేంద్ర శంకుస్థాపనలో తన ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని


ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌సీఎల్ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ కేంద్ర శంకుస్థాపనలో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శ్రీ మోదీ వరుస పోస్టులు చేశారువాటిలో ఇలా పేర్కొన్నారు:

‘‘భారత్‌లో సెమీకండక్టర్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉత్తరప్రదేశ్ ఎదుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణంహెచ్‌సీఎల్ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేసిన కొత్తపరిశ్రమ టెక్నాలజీ శక్తి కేంద్రంగా ఈ రాష్ట్ర నూతన గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది.”

 

ఈ దశాబ్దం భారతదేశపు టెకేడ్హరిత ఇంధనం నుంచి కృత్రిమ మేధ వరకు ఈ దశాబ్దంలో సాంకేతిక రంగంలో భారత్ చేస్తున్న కృషి, 21వ శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాదిగా నిలుస్తుంది.”

 

ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే..దానిని సాధించి చూపిస్తానని గడిచిన 11 ఏళ్లుగా భారత్ నిరూపిస్తూనే ఉందిఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.”

 

***