Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ 131వ భాగంలో ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 131వ భాగంలో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ –
‘‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 140 కోట్ల మంది భారతీయుల సత్తాను చాటిచెప్పింది.
భారత్ రాబోయే కాలంలో, ఈ రంగంలో మునుముందుకు దూసుకుపోతూనే ఉంటుంది.
నేను ప్రస్తావించిన 2 విషయాలు ప్రపంచ నేతల దృష్టిని ఆకట్టుకున్నాయన్న సంగతిని కూడా మీకు తెలియజేస్తున్నాను.
 #MannKiBaat”
‘‘ప్రస్తుతం ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహిస్తున్నారు. భారతీయ మూలాలున్న చాలా మంది ఆటగాళ్లు ఈ ఆటల పోటీలో పాల్గొంటుండటం మనకు గర్వకారణం.

#MannKiBaat”
‘‘కేరళకు చెందిన ఎలీన్ షెరీన్ అబ్రహాం‌కు భారత్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
ఎలీన్ శరీర అవయవాల్ని దానమివ్వాలని ఆమె తల్లితండ్రులైన శ్రీ అరుణ్ అబ్రహాం, శ్రీమతి షెరీన్ యాన్ జాన్ తీసుకున్న నిర్ణయం ముందు తరాల వారికి స్ఫూర్తినిస్తుంది.
#MannKiBaat”
‘‘రేపటి నుంచి మొదలవుతున్న రాజాజీ ఉత్సవం రాష్ట్రపతి భవన్ తీసుకున్న ఓ ప్రశంసనీయ ప్రయత్నం. దీనికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#MannKiBaat”
‘‘డిజిటల్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా ఉండండి. ఈ దిశగా ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిద్దాం.. రండి.
#MannKiBaat”
‘‘భారత రైతులు అసాధారణ విజయాలు సాధిస్తున్నారు. ఇది ఒడిశా, కేరళ, కర్నాటకల ప్రయత్నాల్లో ఇది స్పష్టమవుతోంది.
‘‘ ‘కేరళ కుంభ మేలా’ పేరుతో ప్రసిద్ధమైన ఈ ఉత్సవం రాష్ట్ర ప్రజలకీ, మన వైభవోపేత సంస్కృతకీ మధ్య బలమైన సంబంధాన్ని తెలియజేస్తోంది.
#MannKiBaat”
‘‘జయలలిత గారు ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. తమిళ నాడును అభివృద్ధి దిశగా పరుగులు పట్టించేందుకు ఆమె చేసిన కృషిని, భారతదేశం అభివృద్ధికి ఆమె కట్టుబడి ఉన్న తీరును సదా స్మరించుకొంటూ ఉంటాం మనం.
 #MannKiBaat”
‘‘రండి..భారత్‌లో తయారు చేసిన వస్తువల్నే కొనుగోలు చేద్దాం, భారత తయారీదారు సంస్థలకు మన అండడండలను అందిద్దాం.
#MannKiBaat” అని పేర్కొన్నారు.