పిఎంఇండియా
మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ‘వికసిత ఉత్తరప్రదేశ్‘ ‘వికసిత భారత్‘ కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.
ఈ ప్రాజెక్ట్ వికసిత భారత్‌లో అనుసంధానత ఎలా ఉంటుందనే ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమీకృత వ్యవస్థ నగరంలో ప్రయాణానికి మెట్రోను, ట్విన్ సిటీస్ దార్శనికతను వేగవంతం చేయడానికి నమో భారత్ రైళ్లను ఉపయోగిస్తుంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పని సంస్కృతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రాజెక్టులు ఇకపై గతంలో లాగా మధ్యలో నిలిచిపోవని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తాము శంకుస్థాపన చేసిన పనులను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండింటినీ తామే స్వయంగా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తమ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మీరట్ మెట్రోలో ప్రయాణించి విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. రైలు ఆపరేటర్లు, స్టేషన్ నియంత్రణ సిబ్బందిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టును ‘నారీ శక్తి‘కి చిహ్నంగా ప్రధానమంత్రి కొనియాడారు. దేశంలోనే తొలి నమో భారత్ రాపిడ్ రైల్ సేవలు ప్రారంభమైన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
మీరట్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, 2014, 2019, 2024 జాతీయ ఎన్నికల ప్రచారాలన్నీ ఈ విప్లవ గడ్డ నుంచే నుండే ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర ఆశీస్సులు అందిస్తున్న ఈ ప్రాంత రైతులకు, కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. “2014 కంటే ముందు మెట్రో సేవలు కేవలం 5 నగరాల్లో మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు 25 కంటే ఎక్కువ నగరాల్లో మెట్రోలు నడుస్తున్నాయి, ఇది భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలబెట్టింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఈ ప్రాజెక్ట్ లో సారాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ వద్ద భారతీయ రైల్వేలు, మెట్రో ఇంకా బస్సు స్టాండ్‌ల అనుసంధానం ఒకప్రత్యేకత. భారతదేశంలో తొలిసారిగా నమో భారత్ మెట్రో రైలు ఒకే ట్రాక్, ఒకే స్టేషన్‌లో నడుస్తాయి” అని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ అనుసంధానం వల్ల ప్రయాణికులు నగరం లోపల ప్రయాణించవచ్చు లేదా నేరుగా ఢిల్లీకి వెళ్లవచ్చు, తద్వారా చాలా మంది కార్మికులు, విద్యార్థులు ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉండాల్సిన అవసరం తప్పుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్రైట్ కారిడార్లు, జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ఆధునిక మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడులు అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలను, వ్యాపారాలను ఆకర్షిస్తున్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ శ్రమకు, సృజనకు నిలయమని అభివర్ణిస్తూ, రాష్ట్ర రైతులు, కళాకారులు వారసత్వం – అభివృద్ధి మంత్రాన్ని విజయవంతంగా సాకారం చేస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. భారత ప్రపంచ శక్తి పెరుగుతున్న కొద్దీ, భారత యువశక్తిని ఉపయోగించుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “నేడు ప్రపంచం 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించగల శక్తిగా భారత్‌ను చూస్తోంది, దీనివల్ల ఉత్తరప్రదేశ్ పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని కేటాయించినట్లు ప్రధానమంత్రి చెప్పారు, ఇది ఎం ఎస్ ఎం ఈలకు రుణాలు సులభంగా అందేలా చేస్తుంది. నేత కార్మికులు అంతర్జాతీయ మార్కెట్‌లకు చేరువయ్యేలా సహాయపడటానికి ఉద్దేశించిన ‘మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ యోజన‘ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కొరియర్ ద్వారా వస్తువులను పంపడంపై ఉన్న రూ. 10 లక్షల పరిమితిని తొలగించామని, దీనివల్ల మీరట్, ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్న చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా నేరుగా అమెరికా, యూరప్‌లోని వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని ప్రధానమంత్రి ప్రకటించారు.
“చౌదరి చరణ్ సింగ్ దార్శనికతను గౌరవిస్తూ, ప్రభుత్వం ఆయనకు భారతరత్నను అందజేసింది. ఆయన స్ఫూర్తితో, ఫుడ్ ప్రాసెసింగ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్ రైతులకు ఇప్పటికే దాదాపు 95,000 కోట్ల రూపాయలు అందాయి” అని శ్రీ మోదీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ అభివృద్ధి అత్యంత ప్రధానమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు అల్లర్లు, నేరాలకు నిలయంగా ఉన్న రాష్ట్రం, నేడు బ్రహ్మోస్ క్షిపణులు, మొబైల్ తయారీ, పర్యాటక రంగాలకు గుర్తింపు పొందుతోందని ఆయన పేర్కొన్నారు. నేడు నేరస్థులు జైళ్లలో ఉన్నారని, ఆడబిడ్డలు గౌరవంతో ఉన్నారని, మెరుగుపడిన శాంతిభద్రతలు రాష్ట్రంలో భారీ ఆర్థిక వృద్ధికి, తయారీ రంగ విస్తరణకు దారితీశాయని ఆయన తెలిపారు.
“ఉత్తరప్రదేశ్ ఒక తయారీ కేంద్రంగా మారుతోంది, ఇటీవలే రాష్ట్రంలోని మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. వికసిత భారత్ సాకారం కావాలంటే వికసిత ఉత్తరప్రదేశ్ అత్యవసరం” అని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
आज उत्तर प्रदेश समेत पूरा देश वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर के नए युग का साक्षी बन रहा है। मेरठ मेट्रो, नमो भारत ट्रेन और रीजनल रैपिड ट्रांजिट सिस्टम के नए सेक्शन के शुभारंभ से NCR के लोगों का जीवन और अधिक सरल, सुगम एवं सुविधाजनक बनेगा। https://t.co/gm42Tk3Y7c
— Narendra Modi (@narendramodi) February 22, 2026
हमारी कार्यसंस्कृति ये है कि जिस काम का शिलान्यास किया जाए, उसे पूरा करने के लिए दिन-रात एक कर दिया जाए।
— PMO India (@PMOIndia) February 22, 2026
इसलिए अब परियोजनाएं पहले की तरह लटकती, भटकती नहीं हैं।
नमो भारत हो या मेट्रो सेवा... दोनों का शिलान्यास करने का अवसर मुझे ही मिला था।
और आज मुझे ही इनके लोकार्पण का भी…
देश में ये पहली बार हो रहा है... जब एक ही स्टेशन, एक ही ट्रैक पर नमो भारत और मेट्रो रेल चलेगी।
— PMO India (@PMOIndia) February 22, 2026
यानी एक ही प्लेटफॉर्म से आप शहर के भीतर भी यात्रा कर पाएंगे और उसी स्टेशन से सीधे दिल्ली भी आ-जा सकते हैं: PM @narendramodi
दुनिया के अनेक विकसित देश आज भारत के साथ व्यापारिक समझौते कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 22, 2026
आज विकसित देश भारत के साथ जुड़ने के लिए उत्सुक हैं।
— PMO India (@PMOIndia) February 22, 2026
क्योंकि उनको भारत के विकास में अपना भविष्य दिखता है... उनको भारत की युवाशक्ति में उम्मीद दिखती है।
आज दुनिया को लगता है कि भारत वो ताकत है, जो 21वीं सदी की चुनौतियों का समाधान दे सकती है: PM @narendramodi
मेरठ-हापुड़ और आसपास के इस क्षेत्र ने चौधरी चरण सिंह जी के विजन को शुरुआती दिनों से देखा है।
— PMO India (@PMOIndia) February 22, 2026
ये हमारी सरकार का सौभाग्य रहा कि हमें चौधरी चरण सिंह जी को भारत रत्न देने का सौभाग्य मिला: PM @narendramodi