పిఎంఇండియా
ఐక్యరాజ్యసమితి ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న మేజర్ అభిలాషా బరాక్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం మేజర్ అభిలాషా బరాక్ లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక బలగాల (యూఎన్ఐఎఫ్ఐఎల్) విభాగంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్‌గా, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ పురస్కారం ఆమె అసాధారణమైన సేవలకు లభించిన గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలలో భారత్ సుదీర్ఘకాలంగా అందిస్తున్న విశేష సహకారానికి దక్కిన గౌరవమని ప్రధాని అభివర్ణించారు.
దేశానికి, సమాజానికి, మానవాళికి సేవ చేయాలని ఆకాంక్షించే దేశంలోని లెక్కలేనంత మంది యువతీయువకులకు ముఖ్యంగా భారతమాత పుత్రికలకు ఆమె సాధించిన ఈ విజయం ఒక గొప్ప స్ఫూర్తి అని ఆయన కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“ఐక్యరాజ్యసమితి ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న మేజర్ అభిలాషా బరాక్కు నా హృదయపూర్వక అభినందనలు. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక బలగాల (యూఎన్ఐఎఫ్ఐఎల్) విభాగంలో మేజర్ బరాక్ ప్రస్తుతం ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్‌గా, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారు. ఈ పురస్కారం ఆమె ఆదర్శప్రాయమైన సేవలకు లభించిన గుర్తింపు మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలలో భారత్ సుదీర్ఘకాలంగా అందిస్తున్న విశేష సహకారానికి దక్కిన గౌరవం. దేశానికి, మానవాళికి సేవ చేయాలని ఆకాంక్షించే మన దేశంలోని లెక్కలేనంత మంది యువతీయువకులకు ముఖ్యంగా మన పుత్రికలకు ఆమె సాధించిన ఈ విజయం ఒక గొప్ప స్ఫూర్తి.”
***
Congratulations to Major Abhilasha Barak on being conferred the UN Military Gender Advocate of the Year Award. Major Barak is serving as an Engagement Team Commander and Gender Focal Point within the United Nations Interim Force in Lebanon (UNIFIL). This honour is a recognition… pic.twitter.com/00Yyv963GT
— Narendra Modi (@narendramodi) June 7, 2026