Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ డి.కె. శివకుమార్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డి.కె. శివకుమార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:

“కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డి.కె. శివకుమార్ గారికి అభినందనలు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది.

@DKShivakumar”