Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్వెల్త్ గేమ్స్-2026లో మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణం సాధించిన షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన షర్మిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుషాట్‌పుట్ పరంగా ఈ సీజన్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ప్రధానమంత్రి అన్నారుకామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ కాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

గ్లాస్గోలో చరిత్ర సృష్టించారు!

మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించటంతో పాటు సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన షర్మిలకు హృదయపూర్వక అభినందనలుఈ అద్భుతమైన ప్రదర్శన ద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.”

 

 

 

****

MJPS/SS/ST