పిఎంఇండియా
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన షర్మిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. షాట్‌పుట్ పరంగా ఈ సీజన్లో ఆమె అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ప్రధానమంత్రి అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ కాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“గ్లాస్గోలో చరిత్ర సృష్టించారు!
మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించటంతో పాటు సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన షర్మిలకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన ప్రదర్శన ద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.”
History has been created in Glasgow!
Congratulations to Sharmila for a very special Gold in the Women’s Shot Put F57 event and also for a season-best throw. This remarkable performance ends a two decade long wait for a Para Athletics Gold at the Commonwealth Games.
My best…
— Narendra Modi (@narendramodi) July 28, 2026
****
MJPS/SS/ST
History has been created in Glasgow!
— Narendra Modi (@narendramodi) July 28, 2026
Congratulations to Sharmila for a very special Gold in the Women's Shot Put F57 event and also for a season-best throw. This remarkable performance ends a two decade long wait for a Para Athletics Gold at the Commonwealth Games.
My best…