Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని వడోదరా రూరల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని


గుజరాత్‌లోని వడోదర రూరల్‌లో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“గుజరాత్‌లోని వడోదర రూరల్ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం అత్యంత విచారకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’