పిఎంఇండియా
గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల సందర్భంగా తన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. స్వచ్ఛ ఇంధన రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, దేశ ఆర్థిక పటిష్టత, పారిశ్రామిక రంగాల్లో సాధిస్తున్న స్వయంసమృద్ధి, గుజరాత్ ప్రజల అచంచలమైన కృషి వల్ల భారత్ ఎలా వేగంగా దూసుకుపోతోందో ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘సూరత్ అభివృద్ధి కార్యక్రమంలో గుజరాత్ ప్రగతిని కాంక్షిస్తూ నా కుటుంబ సభ్యుల్లో కనిపించిన ఆనందం, ఉత్సాహం నాలో సరికొత్త శక్తిని నింపాయి’’
‘‘21వ శతాబ్దం ప్రారంభంలోనే వాతావరణ మార్పుల కోసం దేశంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం గుజరాత్. దేశంలోనే తొలి సోలార్ పార్కును నిర్మించడం ద్వారా.. పర్యావరణాన్ని, ఆర్థిక వ్యవస్థను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ భారత్ ఎలా ప్రగతి శిఖరాలను అధిరోహించగలదో గుజరాత్ నిరూపిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది’’
‘‘ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య కూడా భారత్ ప్రతి సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకప్పుడు మన దేశంలో ఇంధన ఉత్పత్తి విషయానికి వస్తే కేవలం మెగావాట్ల కంటే ఎక్కువగా ఆలోచించేవారు కాదు. కానీ నేడు మనం గిగావాట్ల సామర్థ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విప్లవాత్మక ప్రయాణంలో గుజరాత్ పాత్ర ఎంతో కీలకమైనది’’
‘‘భారత్ ఎప్పటికీ ఇతర దేశాలపైనే ఆధారపడి ఉండాలని కోరుకునే వారే నేడు ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రచారాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. అలాంటి వారు ఒకసారి సముద్ర-పారిశ్రామిక కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ‘హజీరా’ సాధించిన అద్భుతమైన శక్తిని, పురోగతిని తప్పకుండా చూడాలి’’.
सूरत के विकास कार्यक्रम में गुजरात की प्रगति को लेकर मेरे परिवारजनों के जोश और उत्साह ने नई ऊर्जा से भर दिया। pic.twitter.com/UoddMDhyoe
— Narendra Modi (@narendramodi) June 5, 2026
गुजरात देश का पहला राज्य है, जिसने 21वीं सदी की शुरुआत में ही क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया। देश का पहला सोलर पार्क बनाकर भी इसने यह प्रेरणा दी कि कैसे इकोनॉमी और इकोलॉजी को साथ लेकर भारत प्रगति की नई ऊंचाइयों को छू सकता है। pic.twitter.com/40X6X9bvyy
— Narendra Modi (@narendramodi) June 5, 2026
दुनिया की मौजूदा चुनौतियों के बीच भारत हर संकट का मजबूती से मुकाबला कर रहा है। हमारे देश में कभी मेगावाट से आगे सोचा ही नहीं जाता था और आज गीगावाट की चर्चा हो रही है, जिसमें गुजरात की अहम भूमिका है। pic.twitter.com/zFx6aUHzTK
— Narendra Modi (@narendramodi) June 5, 2026
आत्मनिर्भर भारत अभियान का मजाक आज वही लोग उड़ा रहे हैं, जो चाहते हैं कि भारत हमेशा दूसरे देशों पर निर्भर रहे। ऐसे लोगों को Maritime-Industrial Hub के रूप में विकसित हो रहे हजीरा की ताकत एक बार जरूर देखनी चाहिए। pic.twitter.com/EJVJXy3x3W
— Narendra Modi (@narendramodi) June 5, 2026