Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన ప్రధానమంత్రి

గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన ప్రధానమంత్రి


గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న సామర్థ్యాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.

రక్షణ రంగంలో స్వదేశీకరణ, ఆత్మనిర్భరతను పెంపొందించడానికి జరుగుతున్న లక్ష్యబద్ధమైన ప్రయత్నాలకు ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం లభించింది. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో మన దేశం సాధిస్తున్న అద్భుతమైన సామర్థ్యాలను నేను ఇక్కడ స్వయంగా వీక్షించాను. రక్షణ రంగంలో స్వదేశీకరణను పెంపొందించడానికి మనం చేస్తున్న కృషికి ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన ఉదాహరణ.”