Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చండీగఢ్‌లో వైద్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

చండీగఢ్‌లో వైద్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన ప్రత్యేక దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. క్రమబద్ధమైన దేశ ప్రగతికి చండీగఢ్ ఒక అద్భుతమైన నమూనాగా కొనియాడారు. మెరుగైన జీవనశైలితో పాటు సులభతర జీవనానికి ఈ నగరం ఎంతో పేరుగాంచిందని ప్రశంసించారు. చండీ మాత పవిత్ర ఆశీస్సులు ఉన్న ఈ ప్రాంత క్రమబద్ధమైన, నిరంతర అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో కట్టుబడి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

 

చండీగఢ్‌లో వైద్య సదుపాయాల కల్పనతో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదల పట్ల అక్కడి ప్రజలు చూపుతున్న ఆసక్తి,  ఉత్సాహం   స్ఫూర్తిదాయకం.  

 

పరిశుభ్రత పట్ల చండీగఢ్ ప్రజలు ఒక కొత్త విప్లవాన్ని, సరికొత్త చైతన్యాన్ని తీసుకువచ్చారు. ఇందుకోసం అక్కడి నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న ఇటువంటి స్వచ్ఛత ప్రచారాలు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

 

గత 12 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం ఆరోగ్య సేవల రంగంలో దేశ సామర్థ్యాన్ని ఎంతగానో పెంపొందించింది. దీనివల్ల ఈ రోజు ప్రజలందరికీ అత్యుత్తమ చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మనం చేసిన ఈ నిరంతర కృషి ఫలితంగానే నేడు భారత్‌ ప్రపంచ దేశాలకు ఒక ప్రధాన వైద్య పర్యాటక కేంద్రంగా అవతరిస్తోంది. 

 

కేవలం జబ్బులు వచ్చాక చికిత్స అందించడమే కాకుండా.. వ్యాధులు రాకుండా ముందే అడ్డుకునే నివారణ ఆరోగ్య సంరక్షణపై మన ప్రభుత్వం నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దీనివల్ల దేశంలోని పేదలు, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ముఖ్యంగా మన తల్లులు, సోదరీలకు ఎనలేని లబ్ధి చేకూరుతోంది.

 

***