Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ అంశంపై తాను రాసిన వ్యాసంలో ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ అంశంపై తాను రాసిన వ్యాసం ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారుఇది కేవలం చట్ట ప్రక్రియ కాదనీభారత మహిళా శక్తి ఆకాంక్షలకు ప్రతిబింబమనీ ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అనేక సందేశాలను ప్రధాని పొందుపరుస్తూ:
‘‘
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వ్యాసాన్ని రాశారుఇది కేవలం చట్ట ప్రక్రియ కాదనీభారత మహిళా శక్తి ఆకాంక్షలకు ప్రతిబింబమనీ ఆయన అన్నారు.
ఈ కింది సందేశాలు ఆ వ్యాసంలోని ముఖ్యాంశాల్ని ప్రస్తావిస్తున్నాయి.’’
‘‘
మహిళల ప్రగతితోనే సమాజం పురోగమిస్తుంది.’’
‘‘
ఆర్థిక జీవితంలోనూసామాజిక జీవితంలోనూ మహిళల ప్రాతినిధ్య పునాదుల్ని బలోపేతం చేయాలి.’’

 

‘‘పరిపాలనలోనూనిర్ణయాలు తీసుకొనే ప్రక్రియల్లోనూ మహిళలు భాగం పంచుకున్నప్పుడువారు తమతో పాటు సార్వజనిక చర్చను సంపన్నం చేసే అనుభవాలనీలోతైన అవగాహననీ తీసుకు రావడమే కాకుండా పాలన నాణ్యతను మెరుగుపరుస్తారు’’.

 

‘‘2029 లోక్‌సభ ఎన్నికల్లోనూవివిధ రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించ శాసనసభ ఎన్నికల్లోనూ మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన తరువాతే ఆ ఎన్నికలను నిర్వహించడం తప్పనిసరి’’.

‘‘2023 సెప్టెంబర్లోపార్లమెంటు ఏకాభిప్రాయంతో నారీ శక్తి వందన్ అధినియమ్‌ను ఆమోదించింది’’.

 

‘‘మహిళల ప్రాతినిధ్యాన్ని ముందుకు తీసుకు పోవడంలో చోటు చేసుకొనే ప్రతి ఆలస్యమూ మన ప్రజాస్వామ్య నాణ్యతనీసమ్మిళితత్వాన్నీ పటిష్ఠపరచడంలో జాప్యానికి కారణమవుతుంది’’.

‘‘మహిళలకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించే సమయం వీలైనంత విస్తృత ఏకాభిప్రాయానికి అద్దం పట్టాలిఈ విషయంలో విశాల జాతీయ హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’’.
‘‘
రండి మనమంతా కలిసి ముందడుగు వేద్దాంరాజ్యాంగ విలువలను బలపరుద్దాందేశ ప్రగతిని కాంక్షిస్తూ మన నారీ శక్తికి సాధికారతను సమకూరుద్దాం’’.
‘‘
వ్యాసాన్ని ఇక్కడ చదవగలరు.. https://nm-4.com/Tbn4Gs’’ అని పేర్కొన్నారు.

***