Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పర్యావరణ పరిరక్షణలో ఘనతను సాధించిన అస్సాం ప్రజలను అభినందించిన ప్రధానమంత్రి


పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయమైన ఘనతను సాధించినందుకు అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ గొప్ప ప్రయత్నంలో ఆ రాష్ట్ర నారీశక్తి ముందుండి నడిపించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

” ప్రశంసనీయమైన ఘనత. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నంలో ముందుండి నడిచిన అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి నా హృదయపూర్వక అభినందనలు.”