Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల ట్రిపుల్ జంప్‌లో రజతం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్‌ను అభినందించిన ప్రధానమంత్రి


గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్–2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రవీణ్ చిత్రవేల్ తన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ జంప్‌ను నమోదు చేయడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఘనత సాధించిన సందర్భంగా చిత్రవేల్‌ను అభినందించిన శ్రీ మోదీ, భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“కామన్వెల్త్ క్రీడలు-2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకం గెలుచుకోవడం, తన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ జంప్‌ను నమోదు చేయడం చాలా సంతోషంగా ఉంది. అతనికి అభినందనలు. అతని భవిష్యత్ ప్రయాణంలో అన్ని ప్రయత్నాల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.

 

****