పిఎంఇండియా
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ‘‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తన ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. పుస్తకం ముఖ్యాంశాల్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, శ్రీ కోవింద్ గారి స్ఫూర్తిదాయక పోరాటాల్నీ, వేర్వేరు భూమికల్లో ఆయన అందించిన విశిష్ట సేవల్నీ, ప్రజాసేవా రంగంలో ఆయన కనబరిచిన తీవ్ర నిబద్ధతనీ పుస్తకం చాలా చక్కగా వివరించిందన్నారు. ఈ అంశాలు భారతీయులందరికీ స్ఫూర్తినిస్తాయనీ, దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న నిజమైన శక్తికి అద్దం పడతాయనీ శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కొన్ని సందేశాలను ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ ‘‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న వాస్తవమైన బలాలను, భారతీయ ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలను ఈ పుస్తకం చాటిచెబుతోంది’’.
‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ జీ రాసిన ఈ పుస్తకం స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు ఎంపీగా, గవర్నరుగా, రాష్ట్రపతిగా ఆయన ఇబ్బందులనీ, అందించిన సేవల్నీ, తోడ్పాటునీ గొప్పగా ప్రస్తావించింది’’.
‘‘ప్రజలకు సేవ చేయడాన్ని శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు జీవనపథంగా ఎంచుకున్నారు. కర్తవ్య దీక్షకే జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అంకితభావం, సేవ చేయాలన్న ఉత్సాహం భారత్లో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ఇస్తాయి’’ అని పేర్కొన్నారు.
***
Delighted to be a part of the release of former President Shri Ram Nath Kovind Ji’s autobiography, ‘Triumph of the Indian Republic: My Life, My Struggles.’ This book reflects the true strengths and possibilities of Indian democracy.@ramnathkovind pic.twitter.com/6Uqn3gYBiv
— Narendra Modi (@narendramodi) August 12, 2026
The book by former President Shri Ram Nath Kovind Ji is an inspiring read, wonderfully highlighting his struggles, service and rich contribution as MP, Governor and the President of India.@ramnathkovind pic.twitter.com/kSOOASCjgV
— Narendra Modi (@narendramodi) August 12, 2026
Shri Ram Nath Kovind Ji chose public service as the path of his life and remained deeply committed to his duties throughout. His dedication and spirit of service are an inspiration for every Indian.@ramnathkovind pic.twitter.com/FtLIYUDaV9
— Narendra Modi (@narendramodi) August 12, 2026