Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పూర్ మృతికి ప్రధాని సంతాపం


ప్రముఖ గాయని శ్రీమతి సుమన్ కల్యాణ్‌పూర్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సుమన్ కల్యాణ్‌పూర్ మరణం తీవ్రంగా కలచి వేసిందని ప్రధానమంత్రి అన్నారు. ఆమె మధుర స్వరం, హృదయాన్ని తాకే గానం.. భారతీయ సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశాయన్నారు. సంగీత ప్రియులు, భారతీయ సినీ అభిమానుల్లో తన పాటలతో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారని తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పూర్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె మధుర స్వరం, హృదయాన్ని తాకే గానం.. మన సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశాయి. సంగీత ప్రియుల్లో, సినీ అభిమానుల్లో తన పాటలతో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె కుటుంబానికీ, అభిమానులకూ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’

 

***