పిఎంఇండియా
మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.
సమానత్వం, సామాజిక న్యాయం అన్న ఆదర్శాలకు బాబూ జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. ఆయన అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎన్నటికీ మరువలేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు వెనవేల వందనాలు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి.”
पूर्व उप प्रधानमंत्री बाबू जगजीवन राम जी को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने समानता और सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर दिया। देश के लिए उनका अमूल्य योगदान सदैव स्मरणीय रहेगा।
— Narendra Modi (@narendramodi) April 5, 2026