Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

మారిషస్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి


మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గూలం‌తో మహేలోని విక్టోరియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల నేపథ్యంలో నాయకులు భేటీ అయ్యారు. 2024 నవంబరులో ప్రధానిగా రామ్‌గూలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన ప్రధానమంత్రి మోదీతో సమావేశం కావడం ఇది నాలుగోసారి.

భారత్, మారిషస్ మధ్య కొనసాగుతున్న సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందిస్తున్న ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలులో సాధించిన పురోగతిని వారు సమీక్షించారు. మారిషన్ అభివృద్ధికీ, ప్రగతికీ భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సేవలకూ, అనుసంధానానికీ, సుస్థిరాభివృద్ధికీ, సముద్ర ఆర్థిక వ్యవస్థకూ దోహదపడతాయని ఆయన తెలియజేశారు.

భారతదేశం అనుసరిస్తున్న మహాసాగర్ దార్శనికత, పొరుగు దేశాలకు ప్రాధాన్యం విధానాల పరిధిలో భారత్, మారిషస్ మధ్య విస్తరించిన వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యాన్నీ, గ్లోబల్ సౌత్ పట్ల తమ ఉమ్మడి నిబద్ధతనూ ప్రధానమంత్రులు ఇద్దరూ అంగీకరించారు.

పరస్పరాభివృద్ధి కోసం, హిందూ మహా సముద్ర ప్రాంతంలో శాంతికీ, స్థిరత్వానికీ, సంక్షేమానికీ కలసి పనిచేయడం కొనసాగిస్తామని నాయకులు పునరుద్ఘాటించారు. 

 

***