పిఎంఇండియా
మన సమృద్ధికి పునాది వ్యవసాయమనీ, రైతు సోదరీ– సోదరులు దేశ ప్రజలకు అన్నదాతలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి కఠోర శ్రమ, అంకిత భావం.. దేశం పురోగమన పథంలో ముందుకు సాగేటట్లు చూస్తున్నాయని ఆయన అన్నారు.
ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు:
‘‘కృషిర్ధన్యా కృషిర్మేధ్యా జన్తూనాం జీవనం కృషిః:
అన్నదః సర్వదశ్చైవ తస్మాచ్ఛ్రేష్ఠతరో హిసః’’
సంపదకు మూలం వ్యవసాయం, మేధను పవిత్రీకరించేదే కాకుండా ప్రాణులన్నింటికీ మూలాధారం అని ఈ సుభాషితం.. మనకు చెబుతోంది. పంటలను పండించి, ప్రపంచానికి ఆహారధాన్యాలను అందిస్తున్నారు రైతులు. నిజానికి, ప్రతి ఒక్కరికీ కావలసిన ప్రతి దానినీ ఇస్తోంది రైతులే. ఆహారం కాకుండా, మరే ఇతర దానం చేసినా, లేదా వస్తు సామగ్రిని సమకూర్చినా ఎలాంటి పరమార్థం అందదు. ఇందువల్ల, సేద్యం చేస్తున్న రైతులే మిగతా అందరి కన్న ఉన్నతులని మనకు ఈ సూక్తి బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘మన సమృద్ధికి పునాది వ్యవసాయం. మరి, మన రైతు సోదరీ–సోదరులే దేశానికి అన్నదాతలు. వారి పరిశ్రమ, అంకితభావాలు దేశ పురోగతిని నిర్ధారిస్తున్నాయి.
కృషిర్ధన్యా కృషిర్మేధ్యా జన్తూనాం జీవనం కృషిః
అన్నదః సర్వదశ్చైవ తస్మాచ్ఛ్రేష్ఠతరో హిసః
***
कृषि हमारी समृद्धि की आधारशिला है और हमारे किसान भाई-बहन देश के अन्नदाता। इनका परिश्रम और समर्पण ही राष्ट्र की प्रगति को सुनिश्चित करता है।
— Narendra Modi (@narendramodi) April 20, 2026
कृषिर्धन्या कृषिर्मेध्या जन्तूनां जीवनं कृषिः।
अन्नदः सर्वदश्चैव तस्माच्छ्रेष्ठतरो हि सः॥ pic.twitter.com/QRfQ8GyAlL