పిఎంఇండియా
సుసంపన్న, వైవిధ్యపూరిత భారత చేనేత సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
‘‘మీకు నచ్చిన చేనేత ఉత్పాదనలతో మీ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పంచుకోగలరు.. ఆ వీడియోలలో ‘గెట్ రెడీ విత్ మీ’ (జీఆర్డబ్ల్యూఎమ్) వీడియోలను కూడా షేర్ చేయగలరు’’ అని శ్రీ మోదీ కోరారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘రేపు, అంటే ఆగస్టు 7న.. జాతీయ చేనేత దినోత్సవం ఉంది. రండి.. వైవిధ్యపూరిత భారత చేనేతలకు మరింత ప్రజాదరణ లభించేటట్లు నడుచుకుందాం.
మీకు నచ్చిన చేనేత ఉత్పాదనలతో మీ మీ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోండి.. జీఆర్డబ్ల్యూఎమ్ వీడియోలను కూడా షేర్ చేయగలరు.
జాతీయ చేనేత దినోత్సవ హ్యాష్‌ట్యాగ్ (#NationalHandloomDay)ను జోడించడమూ మరచిపోకండి’’ అని పేర్కొన్నారు.
Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.
— Narendra Modi (@narendramodi) August 6, 2026
Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.
Don’t forget to use #NationalHandloomDay. pic.twitter.com/zoFdTXphRL