Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి ప్రధాని నివాళి

2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి ప్రధాని నివాళి


2001 డిసెంబరు 13న జరిగిన హేయమైన ఉగ్ర దాడి సమయంలో భారత పార్లమెంటును రక్షిస్తూ, ప్రాణ త్యాగం చేసిన వీర భద్రతా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఘనంగా నివాళి అర్పించారు.

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని దేశం అమితమైన గౌరవంతో స్మరించుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారి ధైర్యం, అప్రమత్తత, తీవ్రమైన ప్రమాద సమయంలో వారు ప్రదర్శించిన అచంచలమైన బాధ్యతా స్ఫూర్తి… ప్రతి పౌరుడికీ శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:

“2001లో మన పార్లమెంటుపై జరిగిన హేయమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేశం ఈ రోజు స్మరించుకుంటోంది. తీవ్రమైన ప్రమాద సమయంలో వారి ధైర్యం, అప్రమత్తత, చెక్కుచెదరని కర్తవ్య నిష్ట చిరస్మరణీయం. అత్యున్నతమైన వారి త్యాగానికి దేశం ఎన్నటికీ రుణపడి ఉంటుంది.”