Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ బింద్యారాణీ దేవీ సొరొఖైబామ్‌కు ప్రధాని అభినందన


కామన్వెల్త్ క్రీడలు– 2026లో మహిళల 58 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణీ దేవి సొరొఖైబామ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కఠోర శ్రమ, అంకితభావంతో ఆమె ఈ విజయం సాధించారని ప్రధానమంత్రి అన్నారు.

భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలంటూ శ్రీ మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం! గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 58 కిలోల విభాగంలో బింద్యారాణీ దేవీ సొరొఖైబామ్ కాంస్య పతకాన్ని సాధించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. కఠోర శ్రమ, అంకితభావంతో ఆమె ఈ విజయాన్ని సాధించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ… ఆమెకు శుభాకాంక్షలు!”

*************

MJPS/SS/ST