పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 79 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో స్నాచ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడం ద్వారా వల్లూరి అజయ్ బాబు ఎనలేని ఖ్యాతిని సంపాదించడని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
అతని భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం అవ్వాలని శ్రీ నరేంద్ర మోదీ కాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో ఘనత!
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల విభాగంలో వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించటం సంతోషకరం. స్నాచ్ విభాగంలో సీడబ్ల్యూజీ రికార్డును నెలకొల్పడం ద్వారా తిరుగులేని ఖ్యాతిని ఆర్జించాడు. అతనికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా“
***
More glory for India in Weightlifting!
— Narendra Modi (@narendramodi) July 28, 2026
Delighted that Valluri Ajaya Babu brings home the Silver Medal in the Men’s 79 kg category at the Glasgow games. He has also etched his name in the record books by setting a CWG Record in the Snatch event. Congratulations to him and all the… pic.twitter.com/APBtXfj1nN