Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రొయేషియా ప్రధాన‌మంత్రి ఆండ్రీ ప్లేంకోవిచ్ భారతదేశ పర్యటన

క్రొయేషియా ప్రధాన‌మంత్రి ఆండ్రీ ప్లేంకోవిచ్ భారతదేశ పర్యటన


‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ సందర్భంగా ఈ రోజు క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ఆండ్రీ ప్లేంకోవిచ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు శ్రీ ఆండ్రీ ప్లేంకోవిచ్ భారతదేశానికి విచ్చేశారు. ఒక క్రొయేషియా ప్రధానమంత్రి భారత్‌ను సందర్శించడం ఇదే మొట్టమొదటిసారి. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర విజ్ఞానం, అనుసంధానత, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలతో సహా విస్తృత రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. చరిత్రాత్మకమైన భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని గుర్తు చేసిన ఇద్దరు నాయకులు.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ ఒప్పందాన్ని త్వరితగతిన అమలు చేయాలని అన్నారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతలను వినియోగించుకోవడంపై ఇరుపక్షాలు మొగ్గు చూపాయి.

భారతదేశపు యోగా, ఆయుర్వేదం వంటి సంప్రదాయ ఆరోగ్య పద్ధతులపై క్రొయేషియా చూపుతున్న ఆసక్తి, నమ్మకాన్ని ప్రధానమంత్రి మోదీ ఎంతగానో అభినందించారు.

2025 జూన్‌లో ప్రధానమంత్రి మోదీ క్రొయేషియాలో పర్యటించారు. ఒక భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం అదే తొలిసారి కావడం గమనార్హం.

 

***