Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాణీ లక్ష్మీబాయికి ప్రధానమంత్రి నివాళులు


భారత్ మాత వీర పుత్రిక రాణీ లక్ష్మీబాయి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.. రాణీ లక్ష్మీబాయికి నివాళులు అర్పించారు. విదేశీ పాలనకు ఎదురొడ్డి పోరాడటంలో రాణీ లక్ష్మీబాయి అజేయ సాహస గాథ మాతృభూమి రక్షణ కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసే అంశంలో ప్రతి తరానికీ సదా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘భారత్ మాత వీర పుత్రిక రాణీ లక్ష్మిబాయికి ఆమె జయంతి సందర్బంగా శత సహస్ర వందనాలు. ఆమె కఠినాతి కఠిన పరిస్థితుల్లో తన కర్తవ్యపాలన, ఆత్మగౌరవ పరిరక్షణలో ఎన్నడూ రాజీపడలేదు. విదేశీ పాలనకు ఎదురొడ్డి నిలిచి ఆమె కనబరిచిన అజేయ సాహసం, అద్భుత శౌర్య గాథ మాతృభూమి కోసం తమ సర్వస్వాన్నీ సమర్పించేందుకు దేశంలో అన్ని తరాల వారికీ స్ఫూర్తిని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.

***