Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో వేల్స్ రాజకుమారుడు, రాజకుమారి భేటీ

ప్రధానమంత్రితో వేల్స్ రాజకుమారుడు, రాజకుమారి భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో వేల్స్ రాజకుమారుడు, వేల్స్ రాజకుమారి 2026 నవంబర్ 18న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలు శరవేగంగా పురోగమిస్తుండటాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ‘భారత్, యూకే విజన్ 2035’ ఈ సంబంధాల మార్గదర్శకత్వంతో పాటు 2026 జులైలో భారత్, యూకే విస్తృత ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి.

కీలక పర్యావరణ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా ఎర్త్‌షాట్ ప్రైజ్ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. భారతీయ నూతన ఆవిష్కర్తలకు లభించిన గుర్తింపును, వారు ప్రపంచ పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో అందించిన తోడ్పాటును ఆయన ప్రశంసించారు. ఎర్త్‌షాట్ ప్రైజ్ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని 2026 నవంబర్ 17న ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా భారతీయ నూతన ఆవిష్కర్తలకు గుర్తింపు లభించింది.

రక్షణ, ఆరోగ్యం, విద్య, ఫిన్‌టెక్, రెండు దేశాల మధ్య ప్రజల పరస్పర సంబంధాలు సహా భారత్, యూకే విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందించింది.

రాజు చార్లెస్-IIIకు, ప్రధానమంత్రి శ్రీ ఆండీ బర్న్‌హామ్‌కు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

***