Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచంపై ప్రభావాన్ని చూపడంలో వీరత్వానికీ, సాహసానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


పరాక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని, సాహసవంతుడైన వ్యక్తి పూర్తి ప్రపంచంపై ప్రసరించగల అమిత ప్రభావాన్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
ధైర్య సాహసాలు, పరాక్రమం ఒక పెద్ద నిధి లాంటివి.. వాటితో ఏ కష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు అని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ యువతలోని ధైర్య, సాహసాలూ, ఆత్మవిశ్వాసమూ ఈ విషయంలో స్ఫూర్తిని అందిస్తున్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘వీరత్వం, పరాక్రమం ఓ పెద్ద నిధి లాంటివి.. వాటితో ప్రతి ఒక్క కష్ట పరిస్థితినీ ఎదుర్కోవచ్చును. భారత యువతలోని సాహసం, ఆత్మవిశ్వాసం ఇదే విధమైన స్ఫూర్తిని అందిస్తున్నాయి.
ఏకేనాపి హి శూరేణ పాదాక్రాన్తం మహీతలమ్
క్రియతే భాస్కరేణేవ స్ఫారస్ఫురితతేజసా.
సూర్య గ్రహం తన ఉజ్వల కిరణాలతో పూర్తి భూమిపై వెలుగులను ప్రసరిస్తున్నట్లుగానే, సాహసి తన ధైర్యంతో, పరాక్రమంతో యావత్తు ప్రపంచంపై ప్రభావాన్ని ప్రసరించగలుగుతార’’ని పేర్కొన్నారు.

 

***