Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారుపదవీ విరమణ పొందే సహచరులను గౌరవించే అవకాశం లభించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారుఇటువంటి సందర్భాలు సభను పార్టీలకతీతంగా ఒక్కటి చేస్తాయనిఅందరిలో ఒకే భావనను నింపుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారుసభ్యులు తిరిగి సభకు వచ్చినాసామాజిక సేవ వైపు మళ్లినా.. వారి అనుభవం దేశానికి గొప్ప ఆస్తిగా నిలుస్తుందన్నారుఎన్నో మార్పులతో కూడిన రాజకీయ రంగంలో ప్రయాణం ఎప్పటికీ ముగియదని.. అనుభవజ్ఞులైన నాయకులకు నూతన అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు. “రాజకీయాల్లో ఎప్పుడూ ముగింపు ఉండదుమీ అనుభవంకృషి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

సభకు వీడ్కోలు పలుకుతున్న సభ్యుల సహకారాన్ని కొనియాడుతూ.. శ్రీ దేవెగౌడశ్రీ మల్లికార్జున ఖర్గేశ్రీ శరద్ పవార్ వంటి అనుభవజ్ఞులను రోల్ మోడల్స్‌గా తీసుకోవాలని కొత్త తరం ఎంపీలకు ప్రధానమంత్రి సూచించారుడిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ జీ మృదు స్వభావాన్నిక్లిష్ట పరిస్థితుల్లోనూ సభ విశ్వాసాన్ని కాపాడుతూ ఆయన వ్యవహరించిన తీరుని ప్రశంసించారుఅంకితభావంతో కూడిన సేవసమాజం అప్పగించిన బాధ్యతల పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. “సమాజం ఇచ్చిన బాధ్యతలకు కట్టుబడి ఉండటాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మారుతున్న సభ సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ.. నేటి 24×7 మీడియా వాతారవరణం అందరినీ అప్రమత్తం చేసినప్పటికీ పార్లమెంటు చరిత్రలో హాస్యంచమత్కారం ఇప్పటికీ అంతర‌్భాగంగా ఉన్నాయని పీఎం శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుప్రతి రెండేళ్లకోసారి ఒక బృందం పదవీ విరమణ పొందటం వల్ల నిరంతరం జ్ఞానమార్పిడి జరుగుతుందనినూతనంగా వచ్చే సభ్యుల ద్వారా వారసత్వ పరిరక్షణ జరుగుతుందని స్పష్టం చేశారుఈ సంస్థాగత కొనసాగింపుప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేసేందుకు కీలకమని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.”ఈ వారసత్వం పార్లమెంటరీ వ్యవస్థను సుసంపన్నం చేసే నిరంతర ప్రక్రియ” అని ప్రధానమంత్రి కొనియాడారు.

రాజ్యసభకున్న విశిష్ట ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. మన పార్లమెంటరీ వ్యవస్థకు రెండో అభిప్రాయం” అపారమైన బలాన్ని చేకూరుస్తుందని పీఎం శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారునిర్ణయాలు ఒక సభ నుంచి మరొక సభకు వెళ్లే ప్రక్రియశాసన నిర్మాణంలో కీలకమైన కోణాన్ని జోడించడమే కాకదేశానికి మెరుగైన ఫలితాలని అందిస్తుందన్నారుఈ ప్రజాస్వామ్య వారసత్వం జాతీయ నిర్ణయాధికారంలో పారదర్శకతనువిశ్లేషణను పెంపొందిస్తుందని తెలిపారు. “పార్లమెంటరీ వ్యవస్థకు రెండో అభిప్రాయం అందించే విలువైన సహకారాన్ని సుమున్నతంగా గౌరవించుకోవాలి” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

పదవీ విరమణ పొందుతున్న సభ్యుల పదవీ కాలంలో పాతకొత్త పార్లమెంటు భవనాల్లో సేవలందించిన అరుదైన గౌరవాన్ని పొందారని ప్రధానమంత్రి అన్నారునూతన పార్లమెంటు భవనంలో జరిగిన ఈ చరిత్రాత్మక మార్పులో భాగస్వాములవటం.. వారి ప్రజా జీవితంలో ఒక సరికొత్తకీలక జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారుసభను గొప్ప బహిరంగ విశ్వవిద్యాలయంగా శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారుఈ సభ దేశంలోని సంక్లిష్ట అంశాలపై అవగాహన కల్పించే విశిష్టమైన విద్యను సభ్యులకు అందిస్తుందని తెలిపారు. “దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించటానికివ్యక్తిగత ఎదుగుదలకు ఇక్కడ గడిపిన ఆరేళ్లు ఎంతో కీలకం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సభ్యుల పార్లమెంటరీ అనుభవం ద్వారా దూరదృష్టిసామర్థ్యం పెరిగాయని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారుపదవీ విరమణ పొందుతున్న సభ్యులు అధికార వ్యవస్థలో ఉన్నాస్వతంత్రంగా సామాజిక సేవ చేస్తున్నా దేశ నిర్మాణానికి వారు అందించిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారుపదవీ విరమణ పొందుతున్న ప్రజాప్రతినిధుల సుదీర్ఘఅంకితభావంతో కూడిన సేవలను పీఎం శ్రీ నరేంద్ర మోదీ మరోసారి కొనియాడుతూవారి నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. “పదవీ విరమణ పొందుతున్న సభ్యులందరి సహకారానికి మరోసారి అభినందనలువారి సేవలకు ప్రశంసలు తెలియజేస్తున్నా” అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ముగించారు.

 

***