పిఎంఇండియా
భారత ఇంధన రంగ పరిణామాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ రాసిన ఓ ప్రత్యేక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.
భారత్ ఒక పటిష్టమైన ఇంధన వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తోందో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సుస్థిరమైన వాతావరణాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తన వ్యాసంలో వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు భరోసానిచ్చే దేశ ఇంధన విధానాల గురించి ఖచ్చితమైన అవగాహన పొందడానికి ఈ వ్యాసాన్ని చదవాలని పాఠకులను ప్రధానమంత్రి ప్రోత్సహించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ భారత్ పటిష్టమైన ఇంధన వ్యవస్థను ఎలా అభివృద్ధి చేస్తుందో, భవిష్యత్తు అవసరాల కోసం సుస్థిరమైన వాతావరణాన్ని ఎలా రూపొందిస్తుందో కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తన వ్యాసంలో వివరించారు.
వికసిత్ భారత్ కు భరోసానిచ్చే దేశ ఇంధన విధానాలపై కచ్చితమైన అవగాహన పొందడానికి ఈ వ్యాసాన్ని చదవండి.’’
***
Union Minister Shri @mlkhattar reflects on how India is powering a robust energy ecosystem and shaping a sustainable atmosphere for the future needs as well!
— PMO India (@PMOIndia) March 18, 2026
Read this piece to get an exact idea of India's energy policies that promise a Viksit Bharat. https://t.co/eVFJpezgfR