Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళుకి ప్రధానమంత్రి ఘన నివాళి


నేడు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారుకరుణవినయంమానవాళికి నిరంతరం చేసిన సేవలతో ఆయన.. ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఇతరుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసినిస్వార్థ సేవలోనే నిజమైన గొప్పతనం ఉందని నిరూపించారని తెలిపారువిద్యసామాజిక సంక్షేమంఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసాధారణమైన కృషి సమాజంపై చెరగని ముద్ర వేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారునిస్వార్థంసేవా మార్గంలో వెళ్లాలనుకునే ఎంతో మందికి ఆయన జీవితం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తూస్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా నా ఘన నివాళులుకరుణవినయంమానవాళికి నిస్వార్థ సేవలందించే నిలువెత్తు రూపంగా ప్రజల జ్ఞాపకాల్లో ఆయన నిలిచిపోయారుఇతరుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసినిస్వార్థ సేవలోనే నిజమైన గొప్పతనం ఉందని నిరూపించారువిద్యసామాజిక సంక్షేమంఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన విశేష కృషి సమాజంపై చెరగని ముద్ర వేసింది. నిస్వార్థంగా సేవా మార్గంలో నడవాలనుకునే ఎంతో మందికి ఆయన జీవితం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తూస్ఫూర్తినిస్తోంది