Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని వావ్-థరాడ్‌లో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగానికి సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

గుజరాత్‌లోని వావ్-థరాడ్‌లో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగానికి సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఉత్తర గుజరాత్‌లో సుమారు రూ.20,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేసేందుకు బనస్కాంత జిల్లాలోని వావ్థరాడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుపవిత్రమైన నవరాత్రి వేడుకలు ముగిసే రోజున భగవాన్ మహావీర్ జయంతి కావటంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మాతా అంబాజీకిభగవాన్ శ్రీ ధరణీధర్‌కు గౌరవపూర్వక ప్రణామాలు అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లోని వరుస పోస్టుల్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

నేను దీసా వైమానిక కేంద్రంలో ల్యాండ్ అవటం వల్ల ఇవాళ్టి వావ్థరాడ్ పర్యటన మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది“.

 

జాతీయ భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగా దీసా ప్రాజెక్టు చాలా కాలంపాటు నిలిచిపోయిందిప్రాధాన్యతా ప్రాతిపదికన మేం దీన్ని పూర్తి చేశాంఇది ఈ ప్రాంతానికే కాకదేశానికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది“.

 

వావ్థరాడ్ సహా ఈ ప్రాంతానికి సంబంధించి నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయిఇక్కడి ప్రజలు ముఖ్యంగా తల్లులుఅక్కాచెల్లెళ్లు చూపిన ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను“.

 

సౌర విద్యుత్ రంగంలో నేడు గుజరాత్ పతాకం రెపరెపలాడుతోందిప్రపంచంలోనే పునరుత్పాదక ఇంధనానికి ప్రధాన కేంద్రంగా మన రాష్ట్రం అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు“.

 

కాంగ్రెస్ పాలనలో అల్లకల్లోలంపేదరికంతో కొట్టుమిట్టాడిన ఉత్తర గుజరాత్ నేడు అభివృద్ధిలో సరికొత్త చరిత్రను లిఖిస్తోందిఇక్కడ మేం చేపడుతున్న పనులతో వావ్థరాడ్బనస్కాంతపటాన్మెహసానా ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది“.

 

యుద్ధం కారణంగా ప్రపంచ సంక్షోభంలోనూ భారత్ ను ద్వేషించే విదేశీ శక్తుల భాషలో కాంగ్రెస్ మాట్లాడటం దురదృష్టకరంవారి కుట్రల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి”