పిఎంఇండియా
పూజనీయ డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామీజీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేసిన అసమానమైన కృషి.. నిస్వార్థ సేవ దిశగా దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం:
‘‘పిబంతి నద్యః స్వయమేవ నాంభః
స్వయం న ఖాదంతి ఫలాని వృక్షా:।
నాదంతి సస్యం ఖలు వారివాహాః
పరోపకారాయ సతాం విభూతయః।।’’
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘మానవతకు అంకితమైన ఉపాసకుడు పరమ పూజనీయ శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామీజీ జయంతి సందర్భంగా కోటి ప్రణామాలు అర్పిస్తున్నాను. విద్య, సమాజ శ్రేయస్సు, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన అసమాన కృషి.. మన దేశంలోని ప్రతి తరానికి నిస్వార్థ సేవ దిశగా స్ఫూర్తినందిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను.’’
‘‘పిబంతి నద్యః స్వయమేవ నాంభః
స్వయం న ఖాదంతి ఫలాని వృక్షా:।
నాదంతి సస్యం ఖలు వారివాహాః
పరోపకారాయ సతాం విభూతయః।।’’
***
मानवता के अनन्य उपासक परम पूज्य डॉ. श्री श्री श्री शिवकुमार स्वामीजी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन! शिक्षा, समाज कल्याण और अध्यात्म के क्षेत्र में उनका अतुलनीय योगदान देश की हर पीढ़ी को निस्वार्थ सेवा के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) April 1, 2026
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति… pic.twitter.com/aR3JdDcrxj