Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం… విచారం వ్యక్తం చేసిన ప్రధాని


కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి ప్రతి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

“కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించటం నన్ను తీవ్రంగా కలిచివేసింది. తమ వారిని కోల్పోయిన వాళ్లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం అందిస్తాం. క్షతగాత్రులకు వారికి రూ. 50,000 అందజేస్తాం” PM @narendramodi”