పిఎంఇండియా
శాంతి, కరుణ, ఆశతో నిండిన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. “యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలి” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“అందరికీ శాంతి, కరుణ, ఆశతో కూడిన ఆనందదాయకమైన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.”
Wishing everyone a joyous Christmas filled with peace, compassion and hope. May the teachings of Jesus Christ strengthen harmony in our society.
— Narendra Modi (@narendramodi) December 25, 2025