పిఎంఇండియా
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం ‘సదైవ అటల్‘ వద్ద ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అటల్ జీ జీవితం ప్రజా సేవకు, దేశ సేవకు అంకితమైందని.. దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని ఆయన స్మృతి స్థలం ‘సదైవ అటల్‘ను సందర్శించి, నివాళులు అర్పించే అదృష్టం నాకు లభించింది. ప్రజాసేవ, దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది“.
पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा। pic.twitter.com/ttQvNyrxGW
— Narendra Modi (@narendramodi) December 25, 2025