పిఎంఇండియా
చట్టసభల్లో స్త్రీలకు రిజర్వేషన్లను కల్పించే చొరవను దేశవ్యాప్తంగా మహిళందరూ ప్రశంసిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
దశాబ్దాలుగా నిలిచిపోయిన ఈ అంశాన్ని అమలు చేయడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ… భారత నారీశక్తికి అంకింతం చేస్తూ రాసిన లేఖను పంచుకున్నారు.
2029లో జరిగే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈ వాగ్ధానాన్ని వీలైనంత త్వరగా నెరవేర్చడంపై తన ఆలోచనలను భారత దేశ నారీశక్తికి అంకితం చేసిన ఈ లేఖలో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:
‘‘చట్ట సభల్లో స్త్రీలకు రిజర్వేషన్లను కల్పించే ఈ చొరవను దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రశంసిస్తున్నారు.
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ అంశాన్ని అమలు చేయడంలో మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ.. నారీశక్తికి నేను రాసిన లేఖ ఇది..’’
‘‘2029 లోక్ సభ, విధాన సభ ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్లను అందించే నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు స్వాగతిస్తున్నారు.
భారత నారీశక్తికి అంకితం చేసిన ఈ లేఖలో, దశాబ్దాల నాటి ఆకాంక్షను వీలైనంత త్వరగా సాకారం చేయడం గురించి నా ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటున్నాను…’’
Women across India are appreciating the initiative to ensure reservation for women in legislative bodies.
— Narendra Modi (@narendramodi) April 14, 2026
Here is my letter to India’s Nari Shakti, reiterating our commitment to implement what has been pending for decades…. pic.twitter.com/Z36xTCfsHx
देशभर की हमारी माताएं-बहनें और बेटियां, साल 2029 के लोकसभा और विधानसभा चुनाव से महिला आरक्षण सुनिश्चित करने के निर्णय की सराहना कर रही हैं।
— Narendra Modi (@narendramodi) April 14, 2026
भारत की नारी शक्ति को समर्पित अपने इस पत्र में मैंने दशकों से लंबित इस संकल्प को जल्द साकार करने के विषय में देशवासियों के साथ अपनी भावनाएं… pic.twitter.com/ybUGJj8Vtk