Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలోని పాలంలో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి


పాలంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఢిల్లీలోని పాలంలో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామనిగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందిస్తామని ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ఢిల్లీలోని పాలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’   

 

***