పిఎంఇండియా
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు పండగలను జరుపుకుంటున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆనందం, ఉత్సాహం నిండిన ఇలాంటి సందర్భాల్లో యావత్ దేశ అవసరాలను తీరుస్తున్న శ్రమ జీవి రైతు సోదరీసోదరుల పట్ల దేశం కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
“ఇత్థం ఫలతి శుద్ధేన సిక్తం సంకల్పవారిణా
పుణ్యబీజమపి స్వల్పం పుంసాం కృషికృతామివ“
రైతు నాటిన చిన్న విత్తనానికి తగిన సమయంలో నీరందించటం వల్ల క్రమంగా పెరిగి గొప్ప పంటను ఇచ్చినట్లుగా.. స్వచ్ఛమైన సంకల్పంతో చేసే చిన్న ప్రయత్నం కూడా కాలక్రమేణా మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక పండగలు జరుగుతున్నాయి. ఈ ఆనందకర, ఉత్సాహకర సందర్భంలో యావత్ దేశాన్ని పోషించే కష్టజీవి రైతు సోదరీసోదరుల పట్ల మనమంతా కృతజ్ఞతతో ఉండాలి.
ఇత్థం ఫలతి శుద్ధేన సిక్తం సంకల్పవారిణా
పుణ్యబీజమపి స్వల్పం పుంసాం కృషికృతామివ“
देश के अलग-अलग हिस्सों में अभी कई पर्व-त्योहार मनाए गए हैं। उमंग और उल्लास से भरे इन अवसरों के लिए हम अपने परिश्रमी किसान भाई-बहनों के कृतज्ञ हैं, जो पूरे देश का पोषण करते हैं।
— Narendra Modi (@narendramodi) April 15, 2026
इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।
पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥ pic.twitter.com/8SCCgbUDoY