పిఎంఇండియా
పురోగతిని సాధించడానికి సూర్యుని మాదిరిగా ఎప్పటికీ చురుకుగా ఉండడం ముఖ్యమని స్పష్టం చేసే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆ సూక్తి ఇలా ఉంది..:
‘‘చరన్ వై మధు విన్దతి చరన్ స్వాదుముంబరమ్
సూర్యస్య పశ్య శ్రెమాణం యో న తన్ద్రయతే చరంశ్చరైవేతి’’.
‘‘సర్వ కాలాల్లో చురుకుగా ఉండే సూర్యుని మాదిరిగా.. ముందుకు సాగిపోయే వారికి ప్రపంచంలో సర్వ శ్రేష్ఠ బహుమతులూ సొంతమవుతాయి. కాబట్టి, మనిషి ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి’’ అనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘సూర్య భగవానుడు శక్తినీ, ఉత్సాహాన్నీ మనందరి జీవితంలో నింపుతుంటాడు. ఈ రోజుననే ప్రారంభించిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన’ కూడా ఆ రవి కారణంగానే ప్రకాశిస్తోంది. ఇది దేశప్రజలకు స్వచ్ఛ ఇంధనం వైపు మొగ్గు చూపేటట్లు నిరంతర స్ఫూర్తిని అందిస్తోంది.
‘‘చరన్ వై మధు విన్దతి చరన్ స్వాదుముంబరమ్
సూర్యస్య పశ్య శ్రెమాణం యో న తన్ద్రయతే చరంశ్చరైవేతి’’ అని పేర్కొన్నారు.
***
भगवान सूर्य हम सबके जीवन में ऊर्जा और उत्साह का संचार करते हैं। आज के दिन शुरू हुई पीएम सूर्य घर: मुफ्त बिजली योजना भी उन्हीं से रोशन है। यह देशवासियों को स्वच्छ ऊर्जा अपनाने के लिए निरंतर प्रेरित कर रही है।
— Narendra Modi (@narendramodi) February 13, 2026
चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्
सूर्यस्य पश्य श्रेमाणं यो न… pic.twitter.com/NWZisQ3lWr