పిఎంఇండియా
మారుమూల గ్రామాలైనా, రద్దీగా ఉండే నగరాలైనా ప్రజలకు విశ్వసనీయమైన స్వరంగా నిలిచిన మాధ్యమాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవం ప్రధానోద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అనేక సంవత్సరాలుగా ప్రజలకు సకాలంలో సమాచారాన్ని రేడియో అందిస్తోందని, ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ చెప్పారు.
‘‘మన ప్రజల్లోని సామాజిక శక్తిని వెలికి తీయడంలో రేడియో సామర్థ్యాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను. ఫిబ్రవరి, 22 ఆదివారం నాడు నెలవారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. దీనికి మీ సూచనలను అందించండి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘మారుమూల ప్రాంతాలైనా, రద్దీగా ఉండే నగరాలైనా, ప్రజలకు విశ్వసనీయమైన స్వరంగా నిలిచిన మాధ్యమాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవ ముఖ్యోద్దేశం. అనేక ఏళ్లుగా సకాలంలో సమాచారాన్ని రేడియో అందిస్తోంది. ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తోంది. ఈ మాధ్యమంతో అనుసంధానమై ఉన్న అందరి కృషిని గుర్తించాల్సిన రోజు ఇది.
మన ప్రజల్లో ఉన్న సామాజిక శక్తిని వెలికి తీయడంలో రేడియోకున్న సామర్థ్యాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ నెల కార్యక్రమం ఫిబ్రవరి 22న ప్రసారమవుతుంది. దీనికి మీ సూచనలను అందించండి.’’
World Radio Day is about celebrating a medium that is a trusted voice for people, be it in remote villages or bustling cities. For years, the radio has delivered timely information, amplified talent and encouraged creativity. This is a day to acknowledge the efforts of all those…
— Narendra Modi (@narendramodi) February 13, 2026