Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ప్రధానమంత్రి నివాళి


మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా- “దేశ పురోగమనానికి, సుపరిపాలనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. వాక్పటిమ గల వక్తగానే కాకుండా ఉత్తేజపూరిత కవితలల్లిన కవిగానూ ఆయన చిరస్మరణీయులు. ఆయన నాయకత్వం, వ్యక్తిత్వం, కృషి దేశ సర్వతోముఖాభివృద్ధికి సదా మార్గనిర్దేశం చేస్తాయి” అని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవపూర్వక నివాళి. అటల్‌ జీ తన జీవితాన్ని సుపరిపాలన, దేశ ప్రగతికే అంకితం చేశారు. ఒక అద్భుత వక్తగానే కాకుండా ఉత్తేజపూరిత కవనంలో చేయి తిరిగిన కవిగానూ ప్రజానీకం ఆయనను సదా స్మరించుకుంటుంది. ఆ మహనీయుడి వ్యక్తిత్వం, కృషి, నాయకత్వం దేశ సర్వతోముఖాభివృద్ధికి కరదీపికగా నిలుస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.