Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్‌లోని కటిహార్ ప్రమాద మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


బీహార్‌లోని కటిహార్ ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ‌్యక్తం చేశారుఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతిని తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారుప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

బీహార్‌లోని కటిహార్‌లో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరంఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నాను.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తాం

 

***