Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత రత్న మహామన పండిట్ శ్రీ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి


భారతరత్న మహామన పండిట్‌ శ్రీ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- మాతృభూమి సేవకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారని కొనియాడారు. అలాగే “బానిసత్వ శృంఖలాల నుంచి దేశమాత విముక్తి కోసం సామాజిక సంస్కరణల దిశగా కృషి చేయడంతోపాటు జాతీయ చైతన్యం రగుల్కొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ విద్యా రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆ మహనీయుడి అసమాన కృషి చిరస్మరణీయం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారతరత్న మహామన పండిట్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళి అర్పిస్తున్నాను. జీవితాంతం మాతృభూమి సేవకే అంకితమైన మహనీయుడాయన. భరతమాత బానిసత్వ సంకెళ్లను ఛేదించడం లక్ష్యంగా సామాజిక సంస్కరణలకు కృషి చేయడమే కాకుండా జన చైతన్యాన్ని తట్టిలేపడంలోనూ కీలక పాత్ర పోషించారు. దేశ విద్యారంగం శ్రేయస్సు దిశగా ఆయన అవిరళ కృషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.