పిఎంఇండియా
మహాగౌరి మాత ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. దేవి దివ్య చరణాలకు ప్రణామాలర్పించారు. మాత దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్నీ, సమృద్ధినీ, మంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
ఒక సంస్కృత కృతిని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆ కృతి ఇలా ఉంది.. :
‘‘శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి:
మహాగౌరి శుభం దద్యాన్మహాదేవప్రమోదదా’’
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ,
‘‘మహాగౌరి మాత చరణాలకు కోటి–కోటి ప్రణామాలు. దేవి దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాన్నీ, సమృద్ధినీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
‘‘శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి:
మహాగౌరి శుభం దద్యాన్మహాదేవప్రమోదదా’’
‘‘అంబ మాత అంటే భక్తులకు ఎనలేని విశ్వాసముంది. మాత పట్ల వారికున్న ఈ శ్రద్ధా, భక్తీ వారి మనోబలాన్ని ఎన్నటికీ సడలిపోనీయవు’’ అని పేర్కొన్నారు.
***
मां महागौरी के चरणों में कोटि-कोटि प्रणाम! उनकी दिव्य आभा हर किसी के जीवन में सुख-समृद्धि और आरोग्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) March 26, 2026
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥ pic.twitter.com/bapPnnNh8j
मां अम्बे में भक्तों की अटूट आस्था होती है। माता के प्रति यह श्रद्धा और भक्ति उनके मनोबल को कभी कमजोर नहीं होने देती।https://t.co/Pd09UPJ6fv
— Narendra Modi (@narendramodi) March 26, 2026