పిఎంఇండియా
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో దుర్ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో జరిగిన దుర్ఘటన బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారంగా అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది
***
The mishap in Markapuram district, Andhra Pradesh, is tragic. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) March 26, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs.…
ఆంధ్రప్రదేశ్ లోని , మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— PMO India (@PMOIndia) March 26, 2026
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.…