పిఎంఇండియా
మాత సిద్ధిదాత్రి ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. భక్తులందరూ సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వారు సాధించేటట్లు దేవీమాత ఆశీర్వాదాలను అందజేయాలని ప్రధాని ప్రార్థించారు.
దేవీ మాతను ఆరాధించినందువల్ల భక్తులు అసాధారణ శక్తిని అందుకోగలుగుతారనీ, ఫలితంగా విజయాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వారు పొందుతారనీ ప్రధానమంత్రి అన్నారు.
ఒక సంస్కృత శ్లోకాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆ స్తోత్రం ఇలా ఉంది.. :
‘‘సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘సిద్ధిదాత్రి మాతకు ప్రణామాలు. దేవీమాత తన ఉపాసకులందరికీ లక్ష్య సిద్ధి కలగాలని ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
దేవీ మాతను ఆరాధించడం వల్ల భక్తుల్లో అద్భుత శక్తి పొంగిపొర్లుతుంది. ఆ శక్తితో, తాము విజయాన్ని సాధించగలమన్న విశ్వాసం వారికి కలుగుతుంది’’ అని పేర్కొన్నారు.
मां सिद्धिदात्री को नमन! देवी मां से कामना है कि वे अपने सभी उपासकों को लक्ष्य-सिद्धि का आशीर्वाद दें।
— Narendra Modi (@narendramodi) March 27, 2026
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥ pic.twitter.com/WHRwQewUaa
देवी मां की साधना से भक्तों में अद्भुत शक्ति का संचार होता है। यह शक्ति उन्हें सफलता के विश्वास से भर देती है।https://t.co/Qwf8dMV9cp
— Narendra Modi (@narendramodi) March 27, 2026