Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొక్కల పెంపకంపై చిరకాల ప్రయోజనాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


భారతీయ చింతనలోని నిత్య జ్ఞానాన్ని చాటిచెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారువృక్షాలు పూలనూపండ్లనూ ఇస్తూ తమ దగ్గరికి వచ్చే మనుషులను సంతోషపెడుతున్న మాదిరిగానేవాటిని నాటిన వ్యక్తి దూరంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి అన్ని రకాల ప్రయోజనాల్నీ అందిస్తాయని ఈ శ్లోకం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..:
‘‘
పుష్పితాఫలవన్తశ్చ తర్పయన్తీహ్ మానవాన్
వృక్షదం పుత్రవత్ వృక్షాస్తారయన్తి పరత్ర చ’’.

 

***